Info
అందరికి నమస్కారం🙏,
నా పేరు శ్రావణ లక్ష్మి🙂 ,నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం.పచ్చని ప్రకృతి లో ఉంటే ఎంతో సంతోషం ఆ సంతోషం మీతో పంచుకుంటే రెట్టింపు అవుతుందనే నా స్వార్థంలో నుండి పుట్టిందే నా ఈ శ్రావణ మేఘం.నాకు మన తెలుగు సాంప్రదాయాలన్న పద్దతులన్న చెప్పలేనంత అభిమానం.నాలుగడుగులు వెనక్కి వేసయినా సరె వెనుకటి పద్దతులు పాటించటానికే ప్రయత్నిస్తాను.చెట్టు నరకటాన్నో,రసాయనికంగా పండించిన ఆహరాన్ని తినటాన్నో నేను అబివృద్ధి అని ఒప్పుకోలేను.ప్రకృతి వినాశనాన్ని ఆపాలని నా బలమైన కోరిక కాని అది నా ఒక్క దాని వల్ల అవుతుందా!అలా అని నేను మౌనంగా ఉంటే?ప్రకృతి తల్లికి నేను చేసే సహాయం సముద్రంలో ఇసుక రేణువంత ,మనమంతా మారాలి మన బిడ్డలకు కూడా మంచి పర్యవరణాన్ని ఇచ్చే ప్రయత్నం చెయ్యాలి అని నా ఆలోచన.నేను చేసే పనులను వీడియో రూపంలో మీతో పంచుకున్నప్పుడు అవి మీకు విజ్ఞానాన్నో వినోదాన్నో కనీసం మీకు ఆటవిడపునో అందిస్తాయి అని భావిస్తున్నాను.
mail id:sravanisworld2709@gmail.com
ఇట్లు
మీ శ్రావణ లక్ష్మి
Stats
Joined Invalid Date
0 total views
Featured video