7 hours ago • K.T. Rama Rao

దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిస్తున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే పని కల్వకుర్తి ప్రాంతం నుంచే మొదలుపెట్టాలి.

కల్వకుర్తి నియోజకవర్గం, ఆమనగల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 

12 hours ago • K.T. Rama Rao

గెలుపు ఓటములకి అతీతమైన స్ఫూర్తి కేవలం క్రీడల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఉండాలి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
🏆 కాకతీయ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు క్రీడల టోర్నమెంట్లో గెలిచిన క్రీడాకారులకు ఈరోజు హైదరాబాద్‌లో బహుమతులు ప్రదానం చేసిన కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, తదితరులు.
ఈ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్ 👇
➡️ భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు
➡️ కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతీఏటా వరంగల్‌లో కెసిఆర్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు వాలీబాల్, కోకో క్రీడల పోటీలను కూడా నిర్వహిస్తున్నారు
➡️ క్రీడాకారుల కోసం పోటీలు నిర్వహిస్తున్న దాస్యం వినయ్ భాస్కర్‌కు అభినందనలు
➡️ పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం దాస్యం వినయ్ భాస్కర్ పనిచేస్తున్నారు
➡️ అధికారంలేకున్నా ప్రజల కోసం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు
➡️ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం, ముఖ్యంగా యువకుల పట్టుదలతో కేసీఆర్ గారు మరోసారి అధికారంలోకి రావడం ఖాయం
➡️ కేసీఆర్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇతర పోటీల్లో విజయం సాధించిన విజేతలకు అభినందనలు 

15 hours ago • K.T. Rama Rao

కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రముఖ మైసిగండి మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కేటీఆర్‌ గారిని సాదరంగా ఆహ్వానించి పూజలు నిర్వహించిన దేవాలయ పూజారులు. 

15 hours ago • K.T. Rama Rao

మొన్న తలుపులు ఎత్తుకుపోయిండు.. నిన్న స్టార్టర్లు ఎత్తుకుపోయిండు.. ఇక రేపు మీ పుస్తెలతాడు కూడా రేవంత్ రెడ్డి ఎత్తుకుపోతడు.
దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిస్తున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే పని కల్వకుర్తి ప్రాంతం నుంచే మొదలుపెట్టాలి.
కల్వకుర్తి నియోజకవర్గం, ఆమనగల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కేటీఆర్ కామెంట్స్ 👇
♦️420 దొంగ హామీలు ఇచ్చి నంగనాచి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు.
♦️కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఎవరికి న్యాయం చేయలేదు. అక్కడ ఎవరికి రైతుబంధు రాలేదు. రుణమాఫీ కాలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వలేదు. ఆడబిడ్డలకు 2,500 రూపాయలు కూడా ఇవ్వలేదు. 
♦️సొంత నియోజకవర్గంలో ఒక్క పని చేయలేదు. పుట్టి పెరిగిన పిల్లనిచ్చిన కల్వకుర్తి ప్రాంతానికి కూడా ఒక్క రూపాయి పని చేయలేదు. 
♦️కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రాజు లాగా రైతు ఎవరి దగ్గర చేయి చాపకుండా బ్రహ్మాండంగా బతికిండు. 
♦️పదేళ్లు మోటార్లు కాలలేదు.. ట్రాన్స్ఫార్మర్లు పేలలేదు. పదేళ్లు రైతులు ఎవరి దగ్గర అప్పులు అడిగే పరిస్థితి లేకుండే. నాట్లేసే టైం కి టింగు టింగు మని రైతుబంధు పైసలు పడుతుండే.
♦️టకీ టకీ మని రైతు భరోసా ఇస్తనని రేవంత్ రెడ్డి గప్పాల్ కొట్టిండు. కానీ రూపాయి కూడా ఇవ్వలేదు. 
♦️కేసీఆర్ కంటే ఎక్కువగా రైతు భరోసా రూ. 15,000 ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు కానీ 10 శాతం మంది రైతులకు కూడా ఇవ్వలేదు. 
♦️సోనియా జన్మదినం సందర్భంగా రుణమాఫీ ఒకేసారి రెండు లక్షలు చేస్తానని చెప్పిండు. కానీ ఇప్పటివరకు చారాణా రుణమాఫీ కూడా చేయలేదు. 
♦️500 బోనస్ 10% మంది కూడా పడలేదు. 
♦️ఆడబిడ్డలకు అరచేతిలో స్వర్గం చూపించిండు.
♦️పిల్లనిచ్చిన అత్తగారి ప్రాంతంలోనీ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రతినెలా 2500 రూపాయలు ఇస్తున్నాడేమో అనుకున్నా. అయితే అత్తగారి ప్రాంతాన్ని కూడా మోసం చేసిండు. 
♦️ఈ 14 -15 నెలలు 35 సార్లు ఢిల్లీకి చెక్కర్లు కొట్టడంతోనే రేవంత్ రెడ్డికి సరిపోయింది. కానీ ఢిల్లీ నుంచి 35 పైసలు కూడా తేలేదు.
♦️కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రివర్స్ మైగ్రేషన్ తో వేరే రాష్ట్రాల కూలీలు పాలమూరుకు వచ్చి పనిచేసేవారు. 
♦️మొన్న తలుపులు ఎత్తుకుపోయిండు. నిన్న స్టార్టర్లు ఎత్తుకుపోయిండు. ఇక రేపు మీ పుస్తెలతాడు కూడా రేవంత్ రెడ్డి ఎత్తుకుపోతడు.
♦️రేవంత్ రెడ్డి దొంగ అని ఎలక్షన్ల ముందు చెప్పినం. తెలంగాణ మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి మోసాన్ని తెలుసుకుంది. 
♦️రైతుకు కులం లేదు మతం లేదు. 70 లక్షల మంది రైతులను కేసీఆర్ గారు పదేళ్లు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. 
♦️73,000 కోట్ల రూపాయల రైతుబంధు పైసలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ భారత దేశంలో కేసీఆర్ ఒక్కరే. 
♦️స్వతంత్ర భారతదేశ చరిత్రలో రైతు చనిపోతే అతని కుటుంబానికి 5 లక్షల భీమా ఇచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్..
♦️మేనమామ లెక్క ఆడబిడ్డ పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో లక్ష రూపాయలు ఇచ్చిండు. 
♦️200 రూపాయల పెన్షన్ ను పదిరెట్లు పెంచి 2000 రూపాయలు చేసిండు కేసీఆర్. 
♦️రేవంత్ రెడ్డి నిజాయితీగల మోసగాడు. 
♦️రేవంత్ రెడ్డిది సిగ్గు ,లజ్జ లేని బతుకు కాబట్టే తెలంగాణ ప్రజలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నా కూడా పట్టించుకోకుండా ఉంటున్నడు.
♦️42% రిజర్వేషన్ల పేరుతో బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు. 
♦️రైతు భరోసా 15,000 ఇస్తానని అన్నదాతలను మోసం చేసిండు.
♦️12,000 ఇస్తానని రైతు కూలీలను మోసం చేసిండు
♦️నెలకు 2,500 ఇస్తానని ఆడబిడ్డలను మోసం చేసిండు 
♦️చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానన్నాడు. లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తా అనీ వాళ్లను మోసం చేసిండు. 
♦️ఇలా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి విజయవంతంగా మోసం చేస్తూనే ఉన్నాడు. 
♦️కాంగ్రెస్ 420 పాలనలో 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 
♦️గురుకుల పాఠశాలలను నడపడం చేతకాని సన్నాసి రేవంత్ రెడ్డి. 
♦️ఇప్పటికి 56 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం విషాదకరం. 
♦️కాంగ్రెస్ దరిద్రపు పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. 
♦️ఎన్నికలకు ముందు కెసిఆర్ రైతుబంధు కోసం ఉంచిన పైసల్నే రేవంత్ రెడ్డి వేసిండు అంతేకానీ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క రూపాయి కూడా రైతు భరోసా కింద ఇవ్వలేదు. 
♦️కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఒక్కో ఎకరానికి 17500 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. 
♦️స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకొని తెలంగాణ ప్రజలు నిలదీయాలి. 
♦️ఎన్నికల తర్వాత దాదాపు 1000 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సంపాదించిండ్రు. ఆ భూముల రేట్లు పెంచుకోవడానికి ఇప్పుడు కొత్తగా పెద్ద రోడ్డు వేయాలని ప్లాన్ చేస్తున్నాడు. 
♦️రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి ఫికర్ లేదు. 
♦️600 కోట్ల రూపాయలు ఇస్తే సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కారం అవుతుంది. 
♦️దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిస్తున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే పని కల్వకుర్తి ప్రాంతం నుంచే మొదలుపెట్టాలి. 

15 hours ago • K.T. Rama Rao

ఆమన్ గల్ రైతు మహా ధర్నాకు బయల్దేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మార్గమధ్యంలో తుక్కుగూడలో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు.


తుక్కుగూడ చౌరస్తాలో గులాబీ జెండాను ఎగరవేసిన కేటీఆర్.. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు పలువురు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. 

1 month ago • K.T. Rama Rao

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు మహా ధర్నాలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

రైతుల‌ను రుణ‌మాఫీ పేరిట‌ మోసం చేసిండు. రూ. 2 ల‌క్ష‌ల రుణాల‌ను మాఫీ చేసేందుకు డిసెంబ‌ర్ 9న సంత‌కం పెడుతా అన్నాడు. కానీ పూర్తిగా రుణ‌మాఫీ కాలేదు. నీకు నిజాయితీ ఉంటే.. నీ సొంతూరు కొండారెడ్డిప‌ల్లెకు పోదాం.. కొడంగ‌ల్‌కు పోదాం.. రుణ‌మాఫీ అయింద‌ని చెప్తే రాజీనామా కాదు రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని అసెంబ్లీలో చెప్పాను. ఉలుకు ప‌లుకు లేదు. రాష్ట్రంలో ఏ ఊరికైనా స‌రే.. డేట్, ప్లేస్, టైమ్ నీ ఇష్టం.. నువ్వు కాక‌పోతే నీ మంత్రుల‌ను పంపించు. వంద శాతం రుణ‌మాఫీ అయింద‌ని రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ నేత‌లు రాజీనామా చేసి పోతాం. చారాణా రుణ‌మాఫీ కూడా కాలేదు. కానీ ఇవాళ డిల్లీకి పోయి రుణ‌మాఫీ చేసిన అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని కేటీఆర్ నిప్పులు చెరిగారు.

కేసీఆర్ మీకు బిచ్చ‌మేసిన‌ట్టు రైతుబంధు కింద రూ. 10 వేలు ఇస్తుండు.. న‌న్ను గెలిపిస్తే రూ. 15 వేలు ఇస్తాన‌ని అన్నాడు. ఏడాది దాటిపోయింది.. ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదు. ఎన్నిక‌ల‌ప్పుడు రూ. 7600 కోట్లు రైతుబంధు వేసేందుకు మేం సిద్ధ‌మైతే ఈసీకి ఉత్త‌రం రాసిండు రేవంత్ రెడ్డి. ఈ టైమ్‌లో వేస్తే కేసీఆర్‌కు ఓట్లు వేస్తార‌ని చెబితే మోదీ ప్ర‌భుత్వం ఆపింది. ఎన్నిక‌లు అయిపోయాక రైతుల‌ను ఇబ్బంది పెట్టిండు.

కేసీఆర్ హ‌యాంలో నాట్ల‌ప్పుడు రైతుబంధు ప‌డుతుండే.. ఇప్పుడు ఓట్ల‌ప్పుడు ప‌డుతున్నాయి. కేసీఆర్ జ‌మ చేసిన రూ. 7600 కోట్ల‌ను పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఓట్ల‌ప్పుడు వేసిండు. వానాకాలం పంట‌కు రైతుబంధు ఇవ్వ‌లేదు. అందుకే ఇవాళ ధ‌ర్నా పెట్టాం. ఎందుకంటే.. ఇది ప్రారంభం మాత్ర‌మే.. రాష్ట్ర‌మంతా ధ‌ర్నాలు పెడుతాం. రైతుల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం 15 వేలు ఇవ్వాలి రైతుభ‌రోసా. ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలి. వానాకాలం రైతుబందును ఎగ్గొట్టిండు.. దాన్ని కూడా విడిచి పెట్టొద్దు అని కేటీఆర్ చెప్పారు. 

1 month ago • K.T. Rama Rao

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసానికి వ్యతిరేకంగా షాబాద్, చేవెళ్లలో రైతుల పక్షాన కదం తొక్కిన బీఆర్ఎస్ శ్రేణులు.

దద్దరిల్లుతున్న బీఆర్ఎస్ పార్టీ రైతు మహా ధర్నా! ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ నాయకులు. 

1 month ago • K.T. Rama Rao

Fight from the front in the movement
Worked with commitment in his own state.
Telangana glory flag
Fluttering in the streets of the universe.
Even in the opposition today
He is fighting with the people's problems as an agenda.
A coward who can't face the question
For the case which has been kept as an agenda to achieve corruption
There's nothing to fear.
He will stand.
He will get mixed in.
Jai Telangana ✊ ✊
 #WeStandWithKTR 

1 month ago • K.T. Rama Rao

✨ నా మీద పెట్టింది అక్రమ కేసు, పొలిటికల్ మోటివేటెడ్ కేసు, ఏమీ లేని లొట్టపీసు కేసు

✨ ఇవాళ హైకోర్టులో కేవలం క్వాష్ పిటీషన్ మాత్రమే కొట్టేశారు. దానికే కాంగ్రెస్ నాయకులు చాలా సంతోషపడుతున్నారు

✨ ఏ విచారణను ఎదుర్కోవడానికైనా నేను సిద్ధం

✨ రక్షణ కవచం లాగా కాంగ్రెస్‌కు బీజేపీ పని చేస్తుంది

✨ఫార్ములా-ఈ కేసు అంశంపై మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR  

👉 పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది. అట్లాగే అవినీతిపరులకు అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకు పొలిటికల్ లోఫర్లకు ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో ఎంతో కొంత చేతులు మారినట్టు అనిపిస్తుంది

👉 ఏదో జరిగిపోయింది అన్నట్టు పొద్దుటి నుంచి కాంగ్రెస్ నాయకులు హడావుడి చేస్తున్నారు

👉 నా మీద పెట్టింది అక్రమ కేసు, పొలిటికల్ మోటివేటెడ్ కేసు, ఏమీ లేని లొట్టపీసు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు వెళ్లాను. 

👉 భారత పౌరుడిగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి పెడుతున్న అక్రమ కేసులను రాజ్యాంగపరంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు నాకున్న ప్రతి హక్కును వినియోగించుకుంటాను 

👉 ఏసీబీ విచారణకు ఆఫీసుకు లాయర్‌తో సహా హాజరవుతానని చెప్పాను. అరగంట వేచి చూసినా ఏసీబీ అధికారులు నన్ను ప్రశ్నలు అడగడానికి వెనుక ముందైన్రు

👉 ఇవాళ హైకోర్టులో కేవలం క్వాష్ పిటీషన్ మాత్రమే కొట్టేశారు. దానికే కాంగ్రెస్ నాయకులు చాలా సంతోషపడుతున్నారు. నాకేదో ఉరిశిక్ష వేసినట్టు  నేరారోపణ జరిగినట్టు సంకలు గుద్దుకుంటున్నారు

👉 క్వాష్ పిటీషన్ కొట్టి వేయడంపై సుప్రీంకోర్టుకు పోతాం. కొద్ది రోజుల్లో విచారణకు వస్తుంది అక్కడ కూడా న్యాయపోరాటం చేస్తా

👉 చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నేను విచారణకు హాజరయ్యాను.. కానీ లాయర్లతో రావద్దన్నారు

👉 పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్‌ను ఇచ్చినట్టు మీడియాకి లీకులు వదిలి సతాయించారు. అందుకే లాయర్ల సమక్షంలోనే నా విచారణ జరగాలని రేపు హైకోర్టుకు వెళుతున్నాను. ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించాలని కోర్టుకు వెళుతున్నాను

👉కొందరు మంత్రులు న్యాయమూర్తులై వాళ్ళే శిక్షలు వేస్తున్నారు. ట్రయల్ మీడియాలో, సెక్రటేరియట్లో, మంత్రుల పేషీలో జరగదు. ట్రయల్ న్యాయస్థానాల్లోనే జరుగుతుంది

👉 మళ్లీ చెప్తున్నా రూపాయి అవినీతి కూడా జరగలేదు. తెలంగాణ కోసం తెలంగాణ ఇమేజ్ ను ఆకాశమంత ఎత్తుకు తీసుకపోయేందుకు భారతదేశంలోనే కాదు ప్రపంచపటంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేసేందుకే నిర్ణయం తీసుకున్నాను తప్ప ఏమీ ఆశించి కాదు

👉 భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వాహనాలన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయమే ఫార్ములా-ఈ కారు రేస్ నిర్వహణ 

👉 కాంగ్రెస్ నాయకులలాగా దివాలాకోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు. లాయర్లతో విచారణకు రేపు హైకోర్టు అనుమతిస్తే ఎల్లుండి 9వ తారీకు ఏసీబీ విచారణకు లాయర్లతో వెళతాను. 

👉 16వ తారీఖు నాడు ఈడీ విచారణకు కూడా హాజరవుతాను. వారు ఏమి అడిగినా సమాధానం చెప్తాను నాకు దాపరికం లేదు దాయాల్సింది ఏమీ లేదు

👉 నిజాయితీకి ధైర్యం ఎక్కువ. రేషంగళ్ళ తెలంగాణ బిడ్డగా ఏ విచారణను ఎదుర్కోడానికైనా నేను సిద్ధం ఇందులో ఎలాంటి శేషభిషాలు లేవు

👉 నేను నేరం చేసినట్టు హైకోర్టు ఎక్కడ చెప్పలేదు నాకు శిక్ష వేయలేదు. కనీసం స్కామ్ జరిగినట్టు కూడా ఎక్కడ అనలేదు 

👉 పత్రికా మిత్రులు ఆగం కావద్దు. ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చేది వేదవాక్కు కాదు లీకులు ఇచ్చి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు

👉 అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టమని మేము కోరితే ముఖ్యమంత్రి పారిపోయాడు. రేవంత్ రెడ్డి మగాడు అయితే తన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో చర్చ పెడితే మీడియా సమక్షంలో నేను చర్చకు రెడీ. ఆ తర్వాత ఏసీబీ విచారణకైనా, ఈడీ విచారణకైనా రెడీ 

👉 తెలంగాణ మూలమూల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు

👉 కాంగ్రెస్ నాయకుల ఇంట్రెస్ట్ ఫార్ములా-ఈ.. మా ఇంట్రెస్ట్ ఫార్మర్

👉 మేము రైతు భరోసా గురించి మాట్లాడతాం. డైవర్షన్ కోసం రేవంత్ ఏం చేస్తున్నాడో మాకు తెలుసు

👉 విధ్వంసం, అటెన్షన్ డైవర్షన్, మోసం చేయడం ఇదే కాంగ్రెస్ నైజం 

👉 రైతు భరోసా ఎప్పుడు వస్తుందని 75 లక్షల మంది అన్నదాతలు ఎదురుచూస్తున్నారు

👉 కేసీఆర్ సార్ 12 సార్లు రైతుబంధు ఇస్తే చిట్టి నాయుడు ఒక్కసారి కూడా ఇవ్వలేదు

👉 ఈసారైనా ఇస్తాడా అని తెలంగాణ రైతులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడాలని మా బీఆర్ఎస్ నాయకులకు చెప్పిన

👉 పార్టీ నిర్మాణంపై, 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ చూపుతున్న నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నేతలు దృష్టి పెట్టాలని సూచించాను

👉 అటెన్షన్ డైవర్షన్‌తో కాంగ్రెస్ ఆడుతున్న నాటకాన్ని ప్రజల ముందు బట్టబయలు చేయాలని మా నాయకులకు చెప్పాను 

1 month ago • K.T. Rama Rao

✴️ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువయ్యింది. 
- కాంగ్రెస్ రైతు భరోసా పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ Kalvakuntla Taraka Rama Rao - KTR  
♦️ రాజ్యంగం అమలులోకి వచ్చిన 75 ఏండ్ల సంబరాల సందర్భంగా.. దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతన్నలే అనే సందేశాన్ని ఇస్తూ, ప్రభుత్వం 15 వేలు ఇస్తామని చెప్పి 12 వేలే అంటూ సవాలక్ష కండీషన్లు పెట్టి, జనవరి 26న రైతు భరోసా మోసానికి అధికారికంగా తెరలేపున్నది రేవంత్ ప్రభుత్వం. 
♦️ ఎకరానికి 15 వేలు ఇస్తామని 12 వేలకు కుదించడం రైతులను నిలువునా వంచించడమే. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించరు. 
♦️ నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ ఈ కాంగ్రెస్ ను రైతన్నలు పాతరేస్తారు.
♦️ మోసం అనే పదం చిన్నదైపోతది. దగా, నయవంచన పదాలు కూడా సరిపోవు.
♦️ కాంగ్రెస్ రైతాంగానికి చేసిన ఈ ద్రోహం.. తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతది.
♦️ కపట నాటకాలకు, నోరు తెరిస్తే అబద్ధాలకు, బూటకపు వాగ్దానాలకు కేరాఫ్ కాంగ్రెస్/రేవంత్ అని రైతాంగానికి అర్థమైపోయింది.
♦️ తెలంగాణ చరిత్రలో రేవంత్ రైతుద్రోహిగా మిగిలిపోతాడు
♦️డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే గ్యారెంటీ అని రాహుల్ గాంధీ అన్నారు
♦️ రైతు భరోసా 12 వేలకు కుదించి సంబరాలు చేయాలని కాంగ్రెస్ అంటోంది. ఎందుకు సంబరాలు చేయాలి రైతన్నలకు 15000 ఇస్తామని చెప్పి కోతలు పెట్టినందుకా?
♦️ ఎన్నికల్లో ఓట్ల కోసం మాయమాటలు చెప్పి మోసం చేసినందుకు పాలాభిషేకాలు చేయాలా? ఎందుకని చేయాలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి
♦️ కాంగ్రెస్ అబద్దాలకు డిక్షనరీలో కొత్త పదాలు కనిపెట్టాలి
♦️ రైతు రుణమాఫీ, రైతుబంధుకు లక్ష కోట్లు కేసీఆర్ ఖర్చు పెట్టారు
♦️ కేసీఆర్ రైతుబంధుగా నిలిచారు. రేవంత్ రెడ్డి రాబందుగా మిగులుతారు
♦️ రాహుల్ గాంధీకి తెలంగాణకు వచ్చే దమ్ము ఉందా?
♦️ ఎన్నికల ప్రచారంలో డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 10 వేలు, తరువాత 15 వేలు అన్న కాంగ్రెస్ నేతల మాటలు ఎక్కడ పోయాయి?
♦️ గతంలో ఇచ్చిన పదివేలనే బిచ్చం అన్న రేవంత్.. మరి నువ్వు పెంచిన వెయ్యి రూపాయలు ఏంటి? ముష్టి వేస్తున్నావా?
♦️ ఓడ దాటే దాక ఓడ మ‌ల్ల‌న్న‌.. ఓడ దాటాక బోడి మ‌ల్ల‌న్న‌.. ఇదే కాంగ్రెస్ తీరు.
♦️ రేవంత్ నుంచి రాహుల్ దాకా రైతులకు చెప్పిందేంటి? చేసిందేంటి?
♦️ ఇచ్చిన మాట తప్పడమే ఇందిరమ్మ రాజ్యమా? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలె.
♦️ రేవంత్ రైతాంగానికి తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలె.
♦️ నమ్మించి నయవంచన చేసినందుకు రాహుల్ గాంధీ 70 లక్షల మంది రైతులకు క్షమాపణలు చెప్పాలె.
♦️ మ్యానిఫెస్టోలో రైతులకిచ్చిన ప్రధాన హామీని నిలబెట్టుకోనందుకు ముఖ్యమంత్రి ముందుగా రాష్ట్ర రైతాంగం ముందు లెంపలేసుకోవాలి. 
♦️ కాంగ్రెస్ నాయకులు రైతుభరోసాపై మాట మార్చినందుకు ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలి.
♦️ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పరిస్థితులు బాగుండేదని రేవంత్ రెడ్డి అన్నారు
♦️ సీఎం పదవిలో కూర్చొని రేవంత్ రెడ్డి తెలంగాణను కించపరిచారు
♦️ దేశంలో అత్యధిక జీతాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ అవమానకరంగా మాట్లాడారు
♦️ దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు పిఆర్సీ, డీఏ ఇచ్చింది బీఆర్ఎస్ కాదా?
♦️ ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణలోనే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దిగజారిందని రేవంత్ మాట్లాడడం వారిని అవమానపరచడమే 
♦️ కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి అనేక గొప్ప కార్యక్రమాలను ఎంతో కృషితో పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగుల స్థితిగతులపైన రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడారు.
♦️ రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు
♦️ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం కాదు కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితి బాగలేదు
♦️ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని నాశనం చేసింది రేవంత్ రెడ్డినే,  మూర్ఖంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది
♦️ రాష్ట్రానికి ఆర్థిక ఇంజన్ గా ఉన్న హైదరాబాదులో హైడ్రా, మూసీతో రియల్ ఎస్టేట్ పడిపోయింది
♦️ సంవత్సరంలో లక్షా 38 వేల కోట్ల అప్పు చేశారు. కేసీఆర్ అప్పు చేస్తే ప్రజలకు పంచారు
♦️ పైసలు ఢిల్లీకి మూటలు పంపుతున్నారా? 
♦️ దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం కాదు దివాళా తీసింది రేవంత్ రెడ్డి మెదడు
♦️ రూ. 5,943కోట్ల రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని అప్పగించాము. రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు అబద్ధం మాట్లాడుతున్నారు
♦️ రైతు భరోసా ఎందుకు ఇవ్వరో రేవంత్ రెడ్డి చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలి
♦️ రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలుపుతాము
♦️ హార్టికల్చర్ రైతులకు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనే దానిపై క్లారిటీ లేదు
♦️ ఉద్యోగులకు భూమితో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు
♦️ స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం దాటేందుకు రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
♦️ రైతుబంధు పథకం ఉండాలా వద్దా అనేది రైతులు నిర్ణయం తీసుకోవాలి
♦️ గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోండి, నిలదీయండి.